రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో రైతులకు సబ్సిడీపై అందించే పరికరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పశువుల దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల పరికరాలు కుటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.