శావల్యాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

11చూసినవారు
శావల్యాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
శావల్యాపురం మండలం కృష్ణాపురం దగ్గర మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. మృతుడు బొందిలిపాలెం గ్రామానికి చెందినవాడని పోలీసులు చెప్పారు. అతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఏదైనా వాహనం ఢీకొట్టిందా, లేక అదుపుతప్పి పడ్డాడా అనేది ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.