మాచవరంలో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలకు సీఐ పదోన్నతులు

3చూసినవారు
మాచవరంలో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలకు సీఐ పదోన్నతులు
మాచవరం పోలీస్ స్టేషన్‌లో గతంలో విధులు నిర్వహించిన ఎస్ఐలు తిరుపతిరావు, మహమ్మద్ షఫీ, ఆవుల హరిబాబులకు సీఐలుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న వీరికి ప్రమోషన్లు కల్పిస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే స్టేషన్‌లో పనిచేసిన ముగ్గురు అధికారులకు ఒకేసారి సీఐ పదోన్నతులు రావడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్