పల్నాడు జిల్లా న్యూ పిడుగురాళ్ల బ్రిడ్జ్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సుమారు 40-45 ఏళ్ల వయస్సున్న మృతుడిని పోలీసులు గుర్తించారు. పిడుగురాళ్ల సీఐ ఈ ఘటనను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. నడికుడి జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి, ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు నడికుడి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించాలని రైల్వే ఎస్సై పి. రమేష్‌బాబు తెలిపారు.