గురజాలను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

2339చూసినవారు
గురజాల నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. కృష్ణానది తీరం వెంబడి ఉన్న చారిత్రక దేవాలయాలు, దైద, గుత్తికొండ బిలాలను ప్రత్యేక ఆకర్షణలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ మంత్రులను ఆహ్వానించి, అధిక నిధులు రాబడతామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్