
మహిళ దారుణ హత్య.. గొంతు కోసి చంపిన దుండగులు
ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోయటంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మహిళగా తెలిసింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు యత్నిస్తోంది.




