
తండ్రి హత్యపై వైసీపీ కార్యకర్త కుమారుల ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్
మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యపై ఆయన కుమారులు ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రిని చంపడమే కాకుండా, కొందరు నాయకులు ఈ మృతిని అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమని, సామాన్యుడి ప్రాణం కాదా అని ప్రశ్నించారు. తమ తండ్రి మరణంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వారు, హత్యకు కారకులైన వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురజాల నియోజక వర్గంలో కలకలం రేపింది.


































