
మాచవరం పీహెచ్సీలో గర్భిణీలకు రక్త పరీక్షలు
మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ, గర్భిణీలకు ప్రతి నెలా పరీక్షలు, పౌష్టికాహారంపై సూచనలు అందిస్తున్నామని తెలిపారు. బిడ్డ ఎదుగుదలకు తల్లి సరైన ఆహారం, వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శాంతకుమారి, ఆశా వర్కర్ మేరీ, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.





































