Apr 03, 2026, 08:04 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం..
Apr 03, 2026, 08:04 IST
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి పాల్గొని, కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రాణాలర్పించిన తొలి సాయుధ పోరాట యోధుడని, ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని రంగారెడ్డి తెలిపారు.