Feb 24, 2026, 13:02 IST/
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం
Feb 24, 2026, 13:02 IST
TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. BHEL, లింగంపల్లి, పటాన్చెరు, బాచుపల్లి, నిజాంపేట్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో మరో గంటలో వర్షం పడుతుందని తెలిపారు. ఆ తర్వాత మాదాపూర్, షేక్పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.