Jan 27, 2026, 16:01 IST/
విశ్రాంత ఐపీఎస్ భార్యను మోసగించిన కేసులో నలుగురి అరెస్ట్
Jan 27, 2026, 16:01 IST
హైదరాబాద్: నగరానికి చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను స్టాక్‌మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసగించిన కేసులో నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మయన్మార్ కేంద్రంగా మోసానికి పాల్పడిన వీరు, బిహార్, పశ్చిమబెంగాల్‌కు చెందిన నలుగురి మ్యూల్ ఖాతాలను ఉపయోగించినట్లు గుర్తించారు. బాధితురాలు రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టగా, రూ.2 కోట్లు లాభం వచ్చినట్లు చూపించి, డబ్బు విత్‌డ్రా చేసుకోకుండా మరికొంత సొమ్ము డిమాండ్ చేశారు.