Feb 08, 2026, 13:02 IST/కరీంనగర్
కరీంనగర్
వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు: మంత్రి పొన్నం
Feb 08, 2026, 13:02 IST
తెలంగాణలోని ఇళ్లు లేని నిరుపేదలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి అర్హులందరికీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి పట్టణ కార్పొరేషన్ ఇవ్వాలని, తమను గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో 600 డబుల్ బెడ్ రూం ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు.