మాచ‌ర్ల‌ - Macherla

తేలు కాటుతో యువకుడు మృతి

తేలు కాటుతో యువకుడు మృతి

రెంటచింతల మండలంలో తేలు కుట్టడంతో వేముల సత్యనారాయణ (33) అనే యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానిక మార్కెట్ సబ్‌యార్డులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సత్యనారాయణను ఈ నెల 6న రాత్రి తేలు కుట్టింది. కుటుంబ సభ్యులు, స్థానికులు అతనికి ప్రాథమిక చికిత్స అందించి గురజాల, దాచేపల్లి ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య భూలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా