మాచర్లలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో రైతు పరిస్థితి దారుణంగా ఉందని, తుఫానులు, వర్షాలు లేకపోవడం, పెట్టుబడి రాక, ఆత్మహత్యలతో రైతులు, రైతు కుటుంబాలు దిగజారిపోతున్నారని అన్నారు. దీనికి పరిష్కారంగా, ముఖ్యంగా 5 ఎకరాల లోపు రైతులకు 100 శాతం సబ్సిడీపై అన్ని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు అందించాలని, అలాగే గిట్టుబాటు ధరతో పంటను పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే 20 ఏళ్లలో ఆహారం కోసం ప్రజలు దోపిడీలు, కొట్లాటలు చేసే అవకాశం ఉందని, ఈ దిశగా కేంద్రం తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ఆయన అన్నారు.