పోలీసు అమరవీరులకు ఘన నివాళి: మాచర్లలో క్యాండిల్ ర్యాలీ

3చూసినవారు
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలో ఇన్స్పెక్టర్ టి. వెంకట రమణ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు, స్థానికులు కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అర్బన్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ, జనసేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారి త్యాగాలు సమాజ శాంతి భద్రతల కోసం నిలిచిపోయాయని, అవి మనందరికీ ప్రేరణగా నిలవాలని అన్నారు. ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్సై అనంతకృష్ణతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :