పల్నాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ఫలితాలు

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని డాక్టర్ దాత దీవి రంగనాదాచార్యా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 580 మార్కులతో ఒక విద్యార్థి ప్రథమ స్థానం సాధించగా, 550 మార్కులకు పైగా ఐదుగురు, 500 మార్కులకు పైగా 11 మంది విద్యార్థులు సాధించారు. మొత్తం మీద 90% ఉత్తీర్ణత సాధించి పాఠశాల సత్తా చాటింది.