చిలకలూరిపేటలో అయ్యప్ప పడిపూజ: వేలాది మంది భక్తుల భక్తి పారవశ్యం

3చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలో శ్రీ అయ్యప్పస్వామి మండల కాల మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 26వ వార్డు అయ్యప్పస్వామి మాల దారుల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పస్వామి పడిపూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అరటి ఓదెలతో మండపాన్ని అలంకరించి, 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. గురు స్వాముల నేతృత్వంలో జరిగిన ఈ పూజకు వేలాది మంది మాలధారులు తరలివచ్చారు. డప్పుశ్రీను ఆలపించిన అయ్యప్ప స్వామి గీతాలకు భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ పడిపూజ కన్నుల పండుగగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్