రెంటచింతల మండలం గోలి గ్రామంలో బుధవారం నిర్వహించిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందం పాల్గొన్నారు. రైతులు త్వరగా రెండో పంట విత్తుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన సబ్సిడీ పథకాలను కూటమి ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.