రోడ్డు విస్తరణలో వసూళ్లు జరుగుతున్నాయ్: రామచంద్రారెడ్డి

2చూసినవారు
మాచర్ల పట్టణంలో రహదారి విస్తరణ పనుల పేరుతో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వై. రామచంద్ర రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన కొందరు అధికారులు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఏ ప్రాంతంలో ఎప్పుడు నిర్మాణాలు తొలగిస్తారో స్పష్టత లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రహదారి విస్తరణ పూర్తి కావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్