మంచికల్లులో రాగి తీగల చోరీ.. రైతులకు రూ. 2 లక్షల నష్టం

1చూసినవారు
మంచికల్లులో రాగి తీగల చోరీ.. రైతులకు రూ. 2 లక్షల నష్టం
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో దొంగలు రైతులపై దాడి చేశారు. రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డిలకు చెందిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి, సుమారు 60 కిలోల రాగి తీగలు, 60 లీటర్ల ఆయిల్‌ను దొంగిలించారు. అంతేకాకుండా, సమీప పొలాల్లో ఉన్న ఆరు విద్యుత్ మోటార్లను కూడా అపహరించారు. ఈ ఘటనతో రైతులకు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్