పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు

2చూసినవారు
పల్నాడు జిల్లా గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై గణపవరం, తిమ్మాపురం మధ్య పరంధామయ్య కంపెనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీ, కారు రెండూ ధ్వంసమయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శివరామకృష్ణ, గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you