కారంపూడి: అన్ని ప్రాంతాల అభివృద్దే కూటమి ప్రభుత్వ ద్వేయం

18చూసినవారు
కారంపూడి: అన్ని ప్రాంతాల అభివృద్దే కూటమి ప్రభుత్వ ద్వేయం
అన్ని ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం మండల పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో దశాబ్దాల కాలంగా మరుగున పడిన ఎస్ పేట రోడ్డుకు రూ. 70 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీ హైస్కూల్ నందు రూ. 56.79 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్