కారంపూడి: ఆరోగ్యాంధ్రనే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

20చూసినవారు
కారంపూడి: ఆరోగ్యాంధ్రనే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా, కారంపూడి మండలంలోని పెద్దకొదమగండ్ల గ్రామంలో రూ. 36 లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్యాంధ్రనే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.