కారంపూడి పట్టణంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. వినుకొండ రోడ్డులోని సాగర్ కుడి కాలువలో ఈతకు దిగిన ఇద్దరు యువకులలో ఒకరు గల్లంతయ్యారు. మరొక యువకుడిని స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. యువకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పట్టణంలో విషాదఛాయ నెలకొంది.