పల్నాడు జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు: శివాలయాలు భక్తులతో కిటకిట

0చూసినవారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు వారాణసి శరత్ కుమార్ నేతృత్వంలో శివయ్య స్వామికి 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దీపాలతో దేవస్థానం ప్రాంగణం మొత్తం నిండిపోయింది. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించి పూజలు చేసుకుంటే పుణ్య ఫలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్