కార్తీక పౌర్ణమి: దైద అమరలింగేశ్వర స్వామి బిలంలో భక్తుల పోటెత్తారు

3చూసినవారు
పవిత్ర కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల మండలం దైద శ్రీ అమరలింగేశ్వర స్వామి బిలంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయం మార్మోగింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు చేసి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర మాసంలో స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అని ఆలయ అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్