మాచర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని నెహ్రు నగర్లో గల వివిఎన్ గార్డెన్స్లో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.