మాచర్ల ఎమ్మెల్యే వాహనంపై బీరు సీసాతో దాడి

14చూసినవారు
మాచర్ల ఎమ్మెల్యే వాహనంపై బీరు సీసాతో దాడి
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వాహన శ్రేణిపై సోమవారం రాత్రి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామంలో బీరు సీసా విసిరి దాడి జరిగింది. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బ్రహ్మంగారి తిరునాళ్లకు వెళ్తుండగా, గ్రామంలోని బైపాస్ మీదుగా వస్తున్న సమయంలో చీకట్లో నుంచి సీసా విసిరారు. ఈ సీసా ఎమ్మెల్యే వాహనం ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనంపై పడింది. పోలీసులు వెంటనే వైకాపా కార్యకర్త షేక్ సైదాను అదుపులోకి తీసుకున్నారు. పారిపోతున్న అతన్ని పట్టుకునే క్రమంలో కిందపడటంతో కాలు విరిగింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్