మాచర్ల: నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: ఎమ్మెల్యే

4చూసినవారు
మాచర్ల: నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: ఎమ్మెల్యే
వరదల్లో రాష్ట్ర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నానా వెతలుపడుతుంటే, వారికి అండగా నిలవాల్సిన వైసీపీ నాయకులు రాబందుల్లా మారి రాజకీయం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలైన 1, 15, 30, 31వ వార్డులలో పర్యటించిన ఆయన, తుపాను వరద బాధితులకు నిత్యావసర సరుకులు, నగదు సాయం అందించారు. అనంతరం అజాద్ నగర్ కాలనీలో చంద్రవంక వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జి వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలుసుకుని, పరిశీలించారు.

ట్యాగ్స్ :