సర్వతోముఖాభివృద్ధి వైపు నియోజకవర్గం పరుగులు పెడుతున్న తరుణంలో, రాజకీయంగా కుట్రపన్ని అడ్డుకోవాలని చూస్తే తోలు తీస్తామని వైసీపీ సోషల్ మీడియా మూకలను ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు జల్ మిషన్ పథకం ద్వారా రూ. 1200 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ను నెలకొల్పి, నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మరో ఏడాదిలో తాగునీరు అందించబోతున్నామని తెలిపారు.