కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎస్. కె సైదావలి (50) అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. పశువుల పాకలో మోటార్ వేయడానికి వెళ్ళినప్పుడు తెగిపడిన వైరు తగిలి అక్కడికక్కడే మరణించారు. సైదావలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.