
నిలిచిపోయిన ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ ఆదేశాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం, 12 నెలల పాటు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని 'ఇన్‌యాక్టివ్' ఖాతాలు, 2 సంవత్సరాలు లావాదేవీలు లేని 'డోర్మాంట్' ఖాతాలు, ఎక్కువ కాలం పాటు సున్నా బ్యాలెన్స్ కలిగి ఎటువంటి కార్యకలాపాలు లేని 'జీరో బ్యాలెన్స్' ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. మోసాలను నిరోధించడం, బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి, బ్యాంకును సందర్శించి KYC ప్రక్రియను పూర్తి చేసి, ఒక చిన్న లావాదేవీ చేయాలి.




