
ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు
ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో, మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్‌లను చేర్చారు. దీనివల్ల వేతన జీవులకు HRAపై పన్ను మినహాయింపు పెరిగే అవకాశం ఉంది. రూ. 5 లక్షలకు పైబడిన వాహనాల కొనుగోలు, రూ. 20 లక్షల స్థిరాస్తి లావాదేవీలు, ఏడాదికి రూ. 10 లక్షల నగదు డిపాజిట్/విత్‌డ్రాలకు పాన్ తప్పనిసరి కానుంది. పిల్లల విద్యా, హాస్టల్ అలవెన్సులు కూడా గణనీయంగా పెరిగాయి.




