చేబ్రోలు మండలంలోని శలపాడు, వేజెండ్ల, నారాకోడూరు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉన్న ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నుంచి తప్పించుకోవడానికి కొందరు దుకాణాలు, షెడ్లలో ఆశ్రయం పొందారు. వర్షంతో వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.