మాచర్ల మండల ఎమ్మార్వోకు శుక్రవారం వరికపుడిసెల సాధన సమితి, పల్నాడు రైతులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం ఇచ్చారు. గత 70 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు ఆందోళనలు చేసినా, ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసినా పనులు ముందుకు సాగలేదని, దీనివల్ల 80 వేల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందక ఎగువ పల్నాడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరికొందరు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు.