రైలులో వివాహితపై దాడి నిందితుడి కోసం గాలింపు చర్యలు

2చూసినవారు
రైలులో వివాహితపై దాడి నిందితుడి కోసం గాలింపు చర్యలు
రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న బాధితురాలు ఈ నెల 26న నడికుడి వైపు ప్రయాణిస్తుండగా, జనరల్ బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఏసీ బోగీకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you