పల్నాడులో విషాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం మండాది బోడు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాలంకయ్య, ఆదిలక్ష్మమ్మలను ఐతంరాజు మారుతి బైక్‌పై మాచర్లకు తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆదిలక్ష్మమ్మ(60), మారుతి(18) మార్గమధ్యంలో మరణించారు. పాలంకయ్య చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
