పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో చేపల వేటకు వెళ్లిన కోటా ప్రసాద్ (37) అనే యువకుడు అక్రమ విద్యుత్ కనెక్షన్ ద్వారా చేపలు పడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం నక్కలవాగులో చోటుచేసుకుంది. ఏపీ ట్రాన్స్కో ఏఈ షేక్ మస్తాన్వలి తెలిపిన వివరాల ప్రకారం, కరెంట్ వైర్‌లోని జాయింట్ తగలడంతో ప్రసాద్ తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కృపారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.