రామాపురం బీచ్ లో సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి

2559చూసినవారు
రామాపురం బీచ్ లో సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి
చీరాల మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన 26 ఏళ్ల నాగలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లింది. సముద్రంలో దిగిన కొద్దిసేపటికే అలల ధాటికి ఆమె గల్లంతయింది. బంధువుల సమాచారం మేరకు మెరైన్ పోలీసులు, గజఈతగాళ్లు నాగలక్ష్మి కోసం గాలింపు చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న చీరాల డి.ఎస్.పి మోయిన్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్