ఆంధ్రప్రదేశ్‌లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో ఈ టెర్మినల్స్ నిర్మించాలని నిర్ణయించారు. అమరావతిలో 8 ప్లాట్‌ఫామ్‌లతో టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు. గన్నవరం టెర్మినల్ అభివృద్ధి ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గనుంది. దీంతో పాటు, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టనున్నారు.