మంగళగిరిలో ఏపీఎల్-2026 సందడి. జూన్ 9 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం

4చూసినవారు
మంగళగిరిలో ఏపీఎల్-2026 సందడి. జూన్ 9 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం
మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా ఏపీఎల్-2026 క్రికెట్ టోర్నీ జూన్ 9 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 7 జట్లు పోటీపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరగనుంది. జూన్ 30న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుండగా, వాతావరణం ప్రతికూలంగా ఉంటే జులై 1ను రిజర్వ్ డేగా కేటాయించారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్