మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని గోపాల్‌కృష్ణ థియేటర్ ఎదురుగా మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 35-40 ఏళ్ల వయస్సున్న మృతుడు సిమెంట్ రంగు నలుపు-తెలుపు చారల షర్ట్, సిమెంట్ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే మంగళగిరి టౌన్ పోలీసులను సంప్రదించాలని టౌన్ ఎస్ఐ రవీంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు.