మంగళగిరి ఆలయంలో కమాండోల మాక్‌డ్రిల్.. ఉగ్రదాడులపై అప్రమత్తత

6చూసినవారు
మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉగ్రదాడులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలనే దానిపై సోమవారం రాత్రి ఆక్టోపస్ కమాండోలు మాక్‌డ్రిల్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రామచంద్రమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసాల్లో, ఉగ్రవాదులను చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం, భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాద పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై కమాండోలు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణకు పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్