అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా పెనుమాక–కిష్టయ్యపాలెం మధ్య నిర్మిస్తున్న రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాగు, రిజర్వాయర్ పనుల మధ్య ఉన్న కట్ట తెగిపోయింది. దీంతో వరద నీరు వేగంగా రిజర్వాయర్‌లోకి చేరి నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది. నీటి ప్రవాహంలో నిర్మాణ సంస్థలకు చెందిన కొన్ని టిప్పర్లు చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.