మహానాడును విమర్శల వేదికగా మార్చారు: శ్యామల

5చూసినవారు
మహానాడును విమర్శల వేదికగా మార్చారు: శ్యామల
తాడేపల్లిలో శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ, టీడీపీ మహానాడును ప్రజా సమస్యల కంటే విమర్శలకే పరిమితం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినా వైఎస్ జగన్ పేరును ప్రస్తావించకుండా టీడీపీ నేతలు మాట్లాడలేకపోతున్నారని, జగన్ పాలనపై వారికి ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్‌పై మాట్లాడే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి లోకేశ్‌కు సూచించారు.

సంబంధిత పోస్ట్