కొలనుకొండ రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి

2చూసినవారు
కొలనుకొండ రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి
తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో రైల్వే పట్టాలపై సుమారు 40 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో, అతని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్