మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం నిబంధనలకు విరుద్ధంగా రాజధాని గ్రామాల పరిధి దాటి అక్రమంగా తరలిస్తున్న ఆరు మట్టి లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాటిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.