మంగళగిరి: అందుబాటులోకి వచ్చిన మరో సీడ్ యాక్సిస్ రోడ్డు

17చూసినవారు
అమరావతిలో మరో 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి కరకట్టపై ప్రయాణ దూరం తగ్గనుంది. మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు, గుంటూరు చానెల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆయన ఆదేశించారు. కరకట్ట పై వెళ్ళే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :