మంగళగిరి మండలంలోని ఆత్మకూరులో పెట్రోల్ బంకును కలెక్టర్ సాయికాంత్ వర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించి, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు గురికాకుండా అవసరానికి మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. అంబులెన్సులు, పాల సరఫరా వాహనాలకు ఇంధనం నింపడంలో ప్రాధాన్యం ఇవ్వాలని బంకు నిర్వాహకులకు ఆదేశించారు.