మంగళగిరి: కార్డన్ అండ్ సెర్చ్.. 58 వాహనాల సీజ్

9చూసినవారు
సమాజాన్ని గంజాయి, అన్ని రకాల మత్తు పదార్థాల నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసు శాఖ దృఢ చర్యలు చేపడుతోంది. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం మంగళగిరి మండలం ఖాజా గ్రామంలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 58 వాహనాలను సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వినియోగం, అక్రమ రవాణా, నిల్వలు పెరుగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఈ ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్